హరితహారంతో నగరంలోని పలు పోలీస్స్టేషన్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. స్టేషన్‌కు వచ్చిన ప్రజల మనస్సును ఉల్లాసపరుస్తున్నాయి. మానసిక ఆందోళనతో స్టేషన్‌కు వస్తున్న బాధితులకు చల్లని గాలినిస్తూ ప్రశాంతతనిస్తున్నాయి. అలసటతో ఉన్న ప్రజలకు చెట్ల నీడలో సేద తీర్చుకునేందుకు అవకాశమిస్తున్నాయి. పచ్చదనం.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ తీసుకున్న హరితహారం నిర్ణయానికి జనం జేజేలు పలుకుతున్నారు. ఇందుకు నగరంలోని కొన్ని పోలీసు స్టేషన్లలో ఉన్న పచ్చదనమే నిదర్శనం.
పచ్చదనానికి కేరాఫ్‌గా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ నిలుస్తుంది. హరితహారంలో నాటిన మొక్కలతో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఒకవైపు గార్డెన్, మరో వైపు ఏపుగా పెరిగిన చెట్లతో పోలీస్‌స్టేషన్ కళకళలాడుతుంది. ఈ స్టేషన్‌కు సంబంధించి ఆరు ఎకరాల విస్తీర్ణంలో హరితహారంలో భాగంగా ప్రతి ఏడాది వందలాది మొక్కలను నాటుతున్నారు. ప్రతి మొక్కను సంరక్షిస్తున్నారు. నాటిన మొక్కల్లో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లనిచ్చేవి కూడా ఉన్నాయి.
స్టేషన్ ఎదురుగా ఉన్న పచ్చటి గార్డెన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నది. కుడివైపు ఏపుగా పెరిగిన అశోక, వేప, కొబ్బరి, కానుగ చెట్లు, ఎడమవైపు జామ, టేకు, సపోట, అల్లనేరడి, పూల చెట్లు, వెనక వైపు మర్రి, వేప చెట్లు చల్లని నీడనిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చే ప్రజలు అక్కడున్న చెట్ల నీడలో సేద తీరుతుంటారు.
మేడ్చల్ అక్టోబర్ 7: ప్రత్యేక రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై హరితహారం చేపట్టి కోట్లల్లో మొక్కలు నాటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో అటవీ సంపద పెరిగి ఆకుపచ్చమయంగా మారింది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం, శుద్ధమైన గాలిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకానికి హరిత నిధిని ఏర్పాటు చేయడం శుభపరిణామం. – సంజీవరావు, మేడ్చల్ బాలాపూర్ పీఎస్‌లోనూ..
బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి . ప్రతి ఏడాది హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నామని పహాడీషరీఫ్, బాలాపూర్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, భాస్కర్ చెబుతున్నారు. చెట్లు కాలుష్య నివారణకు, ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా వేసవిలో చల్లని నీడనిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు కృషి చేయాలని వారు కోరారు.
హరితహారంలో భాగంగా ప్రతి ఏడాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. రెండు నెలల కిందట రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చేతుల మీదుగా మొక్కలను నాటించాము. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తున్నాము. మొక్కలు ప్రతి జీవికి ప్రాణవాయువును అందిస్తాయి. ప్రతి వ్యక్తి మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. – ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పహాడీషరీఫ్ సీఎం ఆలోచన గొప్పది
భావితరాల మనుగడను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ హరితహారం అనే మహా యజ్ఞాన్ని తలపెట్టారు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మారుస్తున్నారు. అటవీ శాతం పెంచేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి కోట్లాది మొక్కలను నాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఇంత మంచి ఆలోచన చేయలేదు. ఇతర రాష్ర్టాలకు సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. – సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్పల్లి కో ఆప్షన్ మెంబర్
భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది
బడంగ్‌పేట, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న హరిత నిధి భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది. అవసరమైన చోట మొక్కలను నాటడానికి వీలుంటుంది. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. అందరికీ ఉపయోగపడే అంశం.- మహేందర్‌రెడ్డి, సీఐ సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం
తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటు సుసాధ్యమవుతున్నది. అన్ని వర్గాలను భాగస్వాములను చేసి హరిత నిధి ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం. దీంతో మొక్కలను సంరక్షించాలనే బాధ్యత పెరుగుతుంది. ఎవరైనా నాటిన మొక్కలను, చెట్లను కొట్టాలని చూస్తే అడ్డుకుంటాం.- ర్యాకల నందుగౌడ్, అలియాబాద్, శామీర్‌పేట మండలం