HomeHyderabadHaritha Haram With Ghmc Crores Of Plants Every Year
ప్రకృతి ఒడిలో.. పచ్చని నగరం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా సోమవారం తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని నగరంలో 50 పారులను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ @ గ్రీన్ సిటీ
ప్రతి యేటా జీహెచ్ఎంసీలోకోటి మొక్కలతో హరితహారం
గతంలో 33.15, స్వరాష్ట్రంలో81.81 స్వేర్ కిలోమీటర్ల మేరకు పెరిగిన అటవీ విస్తీర్ణం
ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్ నగరానికి గుర్తింపు
దశాబ్ది స్ఫూర్తితో 50 పార్కుల ఏర్పాటు
నేడు హరిత పండుగ.. తొమ్మిదో విడత ప్రారంభం
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా సోమవారం తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని నగరంలో 50 పారులను ఏర్పాటు చేయనున్నారు. మాస్ ప్లాంటేషన్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఎనిమిది విడతల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఫలితంగా హైదరాబాద్ నగరం 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 147% పెరుగుదలతో 81.81 చదరపు కిలో మీటర్ల గరిష్ఠంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. పచ్చదనం గణనీయంగా పెరగడమే కాకుండా హైదరాబాద్ నగరం వరల్డ్ గ్రీన్ సిటీగా గుర్తింపు సాధించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి యేటా కోటి మొక్కలు లక్ష్యంగా హరితహారం చేపడుతున్నారు. సోమవారం నుంచి తొమ్మిదో విడతకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతున్నది. ఈ ఏడాది కూడా కోటి మొక్కలను డిసెంబర్ చివరి నాటికల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. అవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, లేక్ ప్లాంటేషన్, ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఓపెన్ స్పేస్ ప్లాంటేషన్, గ్రేవ్ యార్డ్ ప్లాంటేషన్, కాలనీ ప్లాంటేషన్ మొదలైన వివిధ భాగాల కింద 2023- 24లో 100 లక్షల ప్లాంటేషన్‌ను చేపట్టాలని నిర్ణయించారు. వర్టికల్ గార్డెన్స్, ఫ్లై ఓవర్ల కింద పచ్చదనం, ట్రాఫిక్ జంక్షన్, దీవులలో వాటర్ ఫౌంటైన్లు, ల్యాండ్ సేప్ పారులు , ట్రీ పారులు, సెంట్రల్ మీడియన్స్ మొదలైన వాటి అభివృద్ధిని చేయనున్నారు.
బల్దియా పరిధిలో 985 పార్కులు
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 985 పారులు ఉన్నాయి. ఐదు ఎకరాల కంటే ఎకువ విస్తీర్ణంలో ఉన్న 19 మేజర్ పారులను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఆకర్షణీయంగా ఉండే విధంగా వివిధ థీమ్‌లతో డాగ్ పార్, పంచతంత్ర పార్, పాల్మెటం, ఫికస్, బౌగెన్ విల్లెస్, హెర్బల్, బంబూస్ థీమ్‌లతో కూడిన 17 థీమ్ పారులను అభివృద్ధి చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 456 ల్యాండ్ సేప్ పారులను నగర వాసుల ప్రయోజనం కోసం కాలనీ బహిరంగ ప్రదేశాల్లో అభివృద్ధి చేశారు. 753 కాలనీ పారులు కమ్యూనిటీ వెల్ఫేర్ సంఘాలచే నిర్వహించ బడుతున్నాయి. వార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన 600 నర్సరీలను అభివృద్ధి చేశారు.
అర్బన్ పారులు
హైదరాబాద్ నగరం చుట్టూ ఫారెస్ట్ బ్లాక్‌లు సూరారం (455 హెక్టార్లు), మాదన్నగూడ (97హెక్టార్లు), నాదర్గుల్ (43 హెక్టార్లు) బ్లాక్‌లను రూ.17.75 కోట్ల ఆర్థిక వ్యయంతో అభివృద్ధి చేశారు. గాజులరామారం వద్ద ఇప్పటికే పారును ప్రారంభించారు.
ఫ్రీడమ్ పార్లు
భారత 75 ఏండ్ల స్వాతంత్య్రాన్ని పురసరించుకొని దేశభక్తిని సాటిచెప్పడం కోసం “75 ఫ్రీడం పారులు” అభివృద్ధి చేశారు. ఈ పారుల్లో 75 వసంతాలు పూర్తయినందున ఒకొక పారులో 75 మొకలు నాటారు. ఈ తరహాలో 750, 7500 మొకలు నాటేందుకు 75 పారులను ఏర్పాటు చేశారు.
అవార్డులు
2021లో విడుదలచేసిన ఎఫ్ఎస్ఐ నివేదిక ప్రకారం గత 10 ఏండ్ల కాలంలో హైదరాబాద్ నగరం 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 147% పెరుగుదలతో 81.81 చదరపు కిలో మీటర్లు గరిష్ఠంగా అటవీ విస్తీర్ణం పెరిగింది.
హైదరాబాద్ నగరం యొక జీవవైవిద్య సూచిక, వార్డుల వారీగా గ్రీన్ కవర్ యొక మూల్యాంకనం, న్యూఢిల్లీలో ఉన్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సెల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ ద్వారా గుర్తించారు. ఈ నివేదికను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదజేశారు. 2021లో 92 పాయింట్లకుగాను 36 పాయింట్లతో పోలిస్తే 2021లో 92 పాయింట్ల గాను 57 పాయింట్లను హైదరాబాద్ సిటీ సాధించింది. హైదరాబాద్ నగరాన్ని వరుసగా 2020, 2021లో అర్బర్ డే ఫౌండేషన్ ట్రీ సిటీగా గుర్తించింది. హైదరాబాద్ నగరం బ్రెజిల్‌లోని ప్యారిస్, బొగోటా, మెక్సికో సిటీ, మాంట్రియల్, ఫోర్టలేజాలను ఓడించి 2022 సంవత్సరంలో ఐఏపీహెచ్ ద్వారా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును అందుకున్నది.
జీహెచ్ఎంసీలో ప్రతి యేటా కోటి మొక్కలు..
హైదరాబాద్ ప్రజలకు చకటి వాతావరణం కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ముఖ్యంగా ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల్లో పారులను అభివృద్ధి చేయడంతోపాటు ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్ మియావాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ, ట్రీ పార్లు వంటి తదితర రకాల పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులను చేపడుతున్నారు. 14 జూన్, 2014 నుంచి ఇప్పటి వరకు చేపట్టిన హరితహారంతో మొకల పెంపకం ద్వారా పచ్చదనం శాతం పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడ్డాయి. 2014-15 నుంచి 2022-2023 వరకు 741 లక్షల మొకలు వివిధ పద్ధతుల ద్వారా నాటారు. ఇంటింటికీ మొకల పంపిణీతో కలిపి 698.78 లక్షలను పంపిణీ చేశారు.
ఎవర్ గ్రీన్ మేడ్చల్
జిల్లా వ్యాప్తంగా పరిఢవిల్లుతున్న పచ్చదనం
నేడు 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యం
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అంతటా సోమవారం హరితోత్సవం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని 13 మున్సిపాలిటీలతో పాటు 61 గ్రామాలు, జీహెచ్ఎంసీ సర్కిళ్లు, 8 అర్బన్ పార్క్‌లలో మొక్కలు నాటేలా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌రెడ్డి, కేపీ వివేకానంద్ పాల్గొంటారు.
అవెన్యూ ప్లాంటేషన్
రోడ్ల వెంట పచ్చదనాన్ని మెరుగుపరచడానికి, కాలనీలో ఉన్న రోడ్లతో సహా హెచ్ఎంఆర్ఎల్ కారిడార్, మేజర్, సబ్ రోడ్లలో అవెన్యూ ప్లాంటేషన్లను జీహెచ్ఎంసీ చేపట్టింది. 2014 నుంచి నేటి వరకు 1120.67 కి.మీ పొడవునా ఎవెన్యూ ప్లాంటేషన్లు పూర్తి కాగా.. మిగతా తదుపరి పనులు వివిధ పురోగతిలో ఉన్నాయి.
మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్..
160 కి.మీ పొడవు మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ కింద 12.41 లక్షల మొకలు నాటారు. 34 ఫ్లై ఓవర్ల కింద పచ్చదనం, సుందరీకరణ పెంపొందించారు. 2014 తర్వాత 20 ఫ్లై ఓవర్లు పచ్చదనంతో ప్రకృతి దృశ్యంగా ఉండే విధంగా దోహదపడ్డాయి.
వర్టికల్ గార్డెన్స్
ఫ్లై ఓవర్లు, ఖైరతాబాద్ జంక్షన్ (105) పిల్లర్లు, నాగోల్ వద్ద మూసీ వంతెన, బాలానగర్ ఫ్లై ఓవర్, చికడపల్లి, కోరంటి వంతెనలు సౌందర్య విలువను పెంచడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి, ఉష్ణోగ్రతను తగ్గించడానికి అభివృద్ధి చేశారు.
ట్రీ పారులు
2014 నుంచి 406 లేఅవుట్ బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచారు. వాకింగ్ ట్రాక్‌లు, సిటింగ్ బెంచీలు, ట్రీ పార్లను అభివృద్ధి చేశారు.