Koti ENT Hospital | హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోఠి ఈఎన్టీ ఆస్పత్రి నీట మునిగింది. హాస్పిటల్ ప్రాంగణంలో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచింది. గత నెల రోజుల నుంచి నాలా పైకప్పు కుంగి ఆస్పత్రిలోకి మురుగునీరు వస్తున్నా అధికారులు మరమ్మతు చేపట్టకపోవడంతోనే ఇంతలా వరదలు ముంచెత్తాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘బ్లాక్ ఫంగస్’ వంటి మహమ్మారికి సైతం అద్భుతంగా సేవలు అందించిన కోఠి ఈఎన్టీ (ENT) ఆసుపత్రి దుస్థితి ఇది అని సోషల్‌మీడియాలో ఒక వీడియోను హరీశ్‌రావు పోస్టు చేశారు. ఆసుపత్రి నాలా మరమ్మతులు చేయక పోవడంతో భారీగా వర్షం నీళ్ళు చేరే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్న ప్రతిసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వంలో కనీసం స్పందన లేదని విమర్శించారు. వెంటనే స్పందించి నాలా మరమ్మతు పనులు చేపట్టాలని, వరద నీరు ఆసుపత్రికి చేరకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘బ్లాక్ ఫంగస్’ వంటి మహమ్మారికి సైతం అద్భుతంగా సేవలు అందించిన కోఠి ఇ ఎన్ టి (ENT) ఆసుపత్రి దుస్థితి ఇది.
ఆసుపత్రి నాలా మరమ్మతులు చేయక పోవడంతో భారీగా వర్షం నీళ్ళు చేరుతున్న పరిస్థితి.
వర్షం పడుతున్న ప్రతీసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ… pic.twitter.com/Zw5X2QqH0j
— Harish Rao Thanneeru (@BRSHarish) September 26, 2025