మణికొండ/కొండాపూర్, అక్టోబర్ 28 : మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ(85) మంగళవారం తెల్లవారు జామున అనారోగ్యంతో కన్నుమూశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ క్రిన్స్విల్లాస్లోని హరీశ్‌రావు నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు.
నగరంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి.