జూబ్లీహిల్స్, మే1: సివరేజి పూడికతీత పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని జలమండలి జీఎం ఎస్.హరిశంకర్ హెచ్చరించారు. ఎల్లారెడ్డి గూడా సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పూడికతీత పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మ్యాన్ హోల్స్‌లో పూడిక తీసేటప్పుడు సేఫ్టీ నిబంధనలు పాటించని జెట్టింగ్ మెషిన్ ఏజెన్సీకి రూ.10 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా హరిశంకర్ మాట్లాడుతూ.. పూడికతీసే సమయంలో కార్మికులకు విధిగా హెల్మెట్, గ్లోవ్స్, షూస్, ఇతర పనిముట్లు ఇవ్వాలని ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో పనులు చేయిస్తే ఏజెన్సీ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పూడికతీత పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటి వరకు అన్ని ఏజెన్సీలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. మ్యాన్ హోల్స్ వద్ద చేపట్టిన పనుల్లో గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ మెజర్స్ వంద శాతం పాటించాలని ఆదేశించామని తెలిపారు. జలమండలి ఎం డీ, డైరెక్టర్ ఆపరేషన్స్1, సీజీఎం పర్యవేక్షణలో పూడికతీత పనుల్లో సేఫ్టీ నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.