ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ నవయువక్ మండలి, సాంస్కృతిక ట్రస్ట్, తెలంగాణ మరాఠా మండలి, మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో పురానాపూల్ వంతెన నుంచి
సుల్తాన్‌బజార్,ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ నవయువక్ మండలి, సాంస్కృతిక ట్రస్ట్, తెలంగాణ మరాఠా మండలి, మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో పురానాపూల్ వంతెన నుంచి అఫ్జల్‌గంజ్ శివాజీ వంతెన వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర స్వాభిమాన్ షడ్కరి సంఘటన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాజు శెట్టి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శోభాయాత్రలు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయనను ఉత్సవ కమిటీ ప్రతినిధులు మదన్ జాదవ్, ఎల్కే షిండే, దిలీప్ జగ్తాప్, పవన్ షిండే, నివాస్ బికమ్, వినోద్ ఆయనను సన్మానించారు. అంతకు ముందు శోభాయాత్రలో శివాజీ మహారాజ్, జిజియా భాయి, మహారాణా ప్రతాప్, తాంతియా తోపే వంటి దేశ భక్తుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభకు విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

