బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీఆర్ఎస్ భవన్‌కు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు పుష్పగుచ్ఛాలు, గిఫ్ట్‌లు అందజేసి న్యూఇయర్ విషెస్ తెలియజేశారు. జై కేటీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలతో బీఆర్ఎస్ భవన్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. కేటీఆర్ కూడా ప్రజాప్రతినిధులు, అభిమానులను ఆప్యాయంగా పలుకరించడంతో పాటు సెల్ఫీలకు ఫోజులిచ్చారు.
– సిటీబ్యూరో, జనవరి 1