మణికొండ, : పేదల పాలిట సంక్షేమ సేవకుడిగా..ఉద్యమ పితామడిగా, బంగారు తెలంగాణ సాధకుడిగా నిరంతరం నిస్వార్థ సేవతో ప్రజాసంక్షేమానికై శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉండాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ, శంషాబాద్ మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగర్ పట్టణ పరిధిలోని ఐదు డివిజన్లు, శంషాబాద్ మండల పరిధిలోని గ్రామగ్రామాన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా అన్నదానాలు, పేదలకు పండ్లు, దుస్తువుల పంపిణీ, సేవా కార్యక్రమాలు, బైక్‌ర్యాలీలతో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సంబరాలను జరుపుకున్నారు.
గురువారం మణికొండ మున్సిపాలిటీ ప్రధాన రహదారులలో బైక్‌ర్యాలీతో క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకుని ముగ్గులతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గీసీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం హాజరైన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటంతో తయారుచేసిన కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్బంగా కొనియాడారు. నార్సింగి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్‌యాదవ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో కేక్‌కట్‌చేశారు.