సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
రాత్రి 9.30గంటల వరకు నగరంలోని హయత్నగర్లో అత్యధికంగా 3.15సెం.మీల వర్షపాతం నమోదవ్వగా, వనస్థలిపురంలో 2.48సెం.మీలు, సరూర్నగర్, లింగోజిగూడలో 1.0సెం.మీలు, హస్తినపుంరలో 1.0సెం.మీలు, ఉప్పల్ బండ్లగూడలో 6.5మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.