హైదరాబాద్ : హైదరాబాద్లో బలమైన ఈదురుగాలులతో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దని నగర వాసులకు సూచించారు. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 040- 21111111గానీ, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిషారం చూపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Though rains are moderate, gusty winds can cause damages particularly in Hyderabad, stay indoors ⚠️
— Telangana Weatherman (@balaji25_t) July 13, 2022