హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలి క సదుపాయాల సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ) ఎండీ ఫణీంద్ర రెడ్డి పేరిట సైబర్ నేరగాళ్లు ఫేక్ వాట్సాప్ అకౌంట్ సృష్టించడం కలక లం రేపింది. +84587741229 నంబర్ నుంచి కొంతమంది ఉద్యోగులకు నేరగాళ్లు మెసేజ్లు పంపడంతో వారంతా ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన శాఖ సిబ్బంది బుధవారం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జనవరి 7 (నమసే ్తతెలంగాణ): ఉద్యాన పంటల కోత అనంతరం దాదాపు 30 శాతం పంట వ్యర్థమవుతున్నదని, దీన్ని ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి చెప్పారు. బుధవారం వర్సిటీ కార్యాలయంలో కజిన్ 3డీ ల్యాబ్ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ దేశంలో 500 లక్షల టన్నుల పం డ్లు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో దాదాపు 150 లక్షల టన్నులు వ్యర్థాలుగా మారుతున్నాయని చెప్పారు. కూరగాయ లు, పండ్ల వ్యర్థాల్లో షుగర్ శాతం ఎకువగా ఉండటంతో బయోఇథనాల్గా మా ర్చుకునే అవకాశాలు ఉన్నాయని పే రొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ చీనా, సీఆర్ఏడీఏ మాజీ డైరెక్టర్ రామకృష్ణ, కజిన్ 3డీ ల్యాబ్ ప్రతినిధి సుధాకర్, పాల్గొన్నారు.