హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి కాల్పులు (Gunfire) కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ ఫైరింగ్ మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి హుమయున్ నగర్ పీఎస్ పరిధిలోని టోలిచౌకిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. వ్యాపార లావాదీల విషయంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.
టోలిచౌకికి చెందిన సయ్యద్ అక్తర్, గోల్కొండలో నివసించే షకీల్ ఖాన్ మధ్య ఓ ఫ్లాట్ విషయమై శనివారం రాత్రి గొడవ జరిగింది. ఇదే విషయమై తన అనుచరులతో కలిసి అక్తర్ ఇంటికి చేరుకున్న షకీల్ అతనిపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్ధం రావడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిగినట్టు ఆధారాలు ఏమీ లభించలేదని తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని హుమయున్నగర్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.