హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్లో (Shamshabad) కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు కిరాయి విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఓ వ్యక్తి ఎయిర్ గన్తో మరో ప్రయాణికుడిని కాల్చాడు. శంషాబాద్ మండలం నర్కుడా వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య కిరాయి విషయంలో వాగ్వాదం చోటుచేసుకున్నది. అదికాస్తా పెద్దది కావడంతో సమీర్దాస్ అనే ప్రయాణికుడిని, మరో ప్రయాణికుడు ఎయిర్ గన్తో కాల్చాడు. దీంతో సమీర్దాస్ కడుపులో తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.