ఎర్రగడ్డ, జూన్ 2: బోరబండ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల(బాలురు, బాలికల)లో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమణమ్మ పేర్కొన్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం, మ్యాథ్స్, బాటనీ, జంతు శాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్(జేఎల్) పోస్టులతో పాటు పీఈటీ, స్కేవెంజర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు.
పీజీ, బీఎడ్ తో పాటు ఇతర కో కర్క్యూలర్ యాక్టివిటీస్ అర్హతలున్న అభ్యర్థులు అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ లోపు పాఠశాల కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని రమణమ్మ పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే 73309 08473, 96182 49353 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.