బేగంపేట్ డిసెంబర్ 12: ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్ల్లిలోని తన నివాసంలో పలువురు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి పూల మాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ…ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు. హౌసింగ్ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో రేణుకా నగర్‌కు చెందిన కమిటీ ప్రతినిధులు, అలాగే వెస్ట్ మారేడ్‌పల్లిలోని బ్రహ్మకుమారీలు, బన్సీలాల్‌పేట్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
10వ స్టేట్ మీట్‌కు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఆహ్వానం
ఈ నెల 30న గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే 10వ స్టేట్ మీట్‌కు హాజరుకావాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.ఈ మేరకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లైఫ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్పీ భగవాన్, రత్నకుమార్, లక్ష్మిలు కలిసి శ్రీనివాస్‌యాదవ్‌కు ఆహ్వానం పలికారు. 30 నుంచి 100 సంవత్సరాల వయస్సు కలిగిన సుమారు 8 వందల మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారులు పాల్గొంటారని వారు వివరించారు.