మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 7: గ్రూప్-3 పరీక్షలను ఈ నెల 17, 18వ తేదీలలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 115 పరీక్షా కేంద్రాలలో 65,361 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని 17న పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు, 18న పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి కమిషన్ వెబ్సైట్ HTTPS://WWW.TSPSC.GOV.IN నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే అభ్యర్థులు TGPSC టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ని ఫోన్ నం: 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని, లేదా HELPDESK@TSPSC.GOV.IN కు ఇమెయిల్ చేయవచ్చని సూచించారు.