హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు.
హైదర్‌గూడ ఎమ్మెల్యేల నివాస సముదాయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మహిళా దినోత్సవం రోజున మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.
మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమైందని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కోరుకంటి ఉజ్వల, కాలేరు పద్మ,పుష్ప,చంద్రవతి, సంగీత, కోనేరు మధులిక, మంజుల ,విజయ, కీర్తన రమ్య, తదితరులు పాల్గొన్నారు.