TGSRTC | సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ.. నిర్దేంచిన లక్ష్యాన్ని అధిగమించి పరుగులు తీస్తున్నది. రెండు వారాల టార్గెట్లో భాగంగా 25 డిపోలకు రూ. 34.79 కోట్లు నిర్దేశించగా.. 34.91 కోట్లను రాబట్టింది. మహాలక్ష్మి పథకం టికెట్లు కాకుండా మిగిలిన టికెట్లు, బస్సు పాసులు, ప్రత్యేక పాసులు తదితర వాటితో ఆర్టీసీ ఈనెల 13 వరకు 34.91 కోట్లను వసూలు చేసింది. అంతేకాదు రూ. 12 లక్షలు అధికంగా సమకూరింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ సిబ్బందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ప్రశంసించారు.
కాగా, విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు పాసులు తీసుకుంటున్నారు. నగరంలోని కాలేజీల వద్ద మొబైల్ పాస్ కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ప్రత్యేక రాయితీలతో పాస్లు జారీ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఖజానా గలగలమంటున్నది. అత్యధికంగా ఎస్ఆర్నగర్ రీజియన్లో రూ. 18.44 కోట్లు ఆదాయం సమకూరినట్టు అధికారులు పేర్కొన్నారు.