బాబోయ్.. దోమలు
గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
- విజృంభిస్తున్న వ్యాధులు
- బెంబేలెత్తిపోతున్న సిటీ ప్రజలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉంటే నగరంలోని పలు బస్తీ దవాఖానలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ పరీక్షలు నిర్వహించే కిట్స్ లేవని సిబ్బంది చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇది డెంగీ సీజన్ కాదులేండి అంటూ..నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, దీనివల్ల ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లకతప్పడం లేదంటున్నారు.
మరోవైపు బస్తీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు, మురుగునీరు వంటి వాటితో దోమలు వృద్ధి చెంది.. కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంత కాలంగా జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు పరిశుభ్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంటమాలజీ, మలేరియా విభాగం అధికారులు, సిబ్బంది దోమల నివారణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటి లార్వా వంటి చర్యలు చేపట్టడం లేదని, అనేక సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

