సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో మరోసారి చలిపులి పంజా విసురుతోంది. పగలు ఎండ దంచికొట్టినప్పటికీ రాత్రి, ఉదయం సమయంలో మాత్రం చలి తన ప్రతాపం చూపిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.5 డిగ్రీలు తగ్గి, 15.5 డిగ్రీల సెల్సియస్గాను, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.4 డిగ్రీలు, గాలిలో తేమ 29శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.