మా నీళ్లు.. మాకేనని
గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్లగొండ సభకు తరలివెళ్లారు.
- నల్లగొండలో గులాబీ దండు గర్జన
- కృష్ణా జలాల హక్కుల కోసం పోరుబాట
- కదం తొక్కిన గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు
- ప్రతిపక్ష హోదాలో తొలిసారి సభ
- కేసీఆర్ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో జోష్
సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్లగొండ సభకు తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులతో పాటు భారీ సంఖ్యలో కార్ల ర్యాలీలతో నియోజకవర్గాల వారీగా వేల సంఖ్యలో సభకు తరలివెళ్లారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సభకు వెళ్లారు.
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునివ్వగా.. ఈ సభకు అన్నివర్గాల ప్రజానీకం తండోపతండాలుగా తరలివెళ్లారు. కృష్ణా జలాల కోసం కొట్లాడకుండా..కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరీని ఎండగట్టిన తీరు.. కట్ట కాలేంత వరకు తెలంగాణ హక్కుల కోసం పులిలా కొట్లాడతానని కేసీఆర్ సభ ద్వారా ప్రసంగించిన తీరును అందరినీ ఆకట్టుకున్నది. ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభ బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కొత్త జోష్‌ను నింపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

