సిటీ బ్యూరో/ ఖైరతాబాద్: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది. భిన్న రకాల మొక్కలు, విభిన్న రకాల పుష్పజాతులు, ఔషధ, అరుదైన మొక్కలను అందుబాటులో ఉంచారు.
సుమారు 150 స్టాళ్లలో ఏర్పాటు చేసిన మొక్కలను కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. కాగా, గ్రాండ్ నర్సరీ మేళాలో ‘స్నేహ నర్సరీ’ ప్రదర్శించిన అరుదైన మొక్కలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నర్సరీ మేళాలోని స్టాల్ నంబర్ 9లో విభిన్న రకాల మొక్కలను అందుబాటులో ఉంచామని స్నేహ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ లక్కరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.