హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమణకు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన మేరకు వారు సమ్మె విరమణకు ప్రకటన చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. ఆదివారం పంచాయతీ కార్యదర్శులు మంత్రి ఎర్రబెల్లిని కలిశారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, ఇటీవలే అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారనే విషయాన్ని వారికి మంత్రి గుర్తుచేశారు. దీంతో సమ్మెను విరమించేందుకు కార్యదర్శులు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.