GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కొత్తగా 1578 శానిటేషన్ వర్కర్ల నియామకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నం. 1473ను జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నెలకు రూ.15,600ల వేతనం చొప్పున నియమించనున్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 25,613ల మంది పారిశుధ్య కార్మికులు ఉండగా, పెరుగుతున్న పారిశుధ్య అవసరాల దృష్ట్యా ఈ నియామకాలను చేపట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికల్లా శానిటేషన్ వర్కర్లను నియమించుకోనున్నారు.