మెహిదీపట్నం, అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని సోమవారం బాపూఘాట్లో గాంధీ సమాధిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కె.కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, పర్యాటక శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, కార్వాన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ తదితరులు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధ్యాన మందిరం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద పూలు వేశారు. ఇదిలా ఉండగా ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలలో గవర్నర్ తమిళిసై పాల్గొనకుండా బయట నుంచే వెళ్లిపోయారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కమిషనర్ రొనాల్డ్ రాస్, ఉన్నతాధికారులు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చీఫ్ అడిషనల్ కమిషనర్ యాదగిరి రావు, శ్రీవాత్సవ, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీపీఆర్వో మహమ్మద్ మూర్తూజ అలీ, తదితరులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో…
సికింద్రాబాద్, హరిహర కళాభవన్లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డా.అశ్రిత రెడ్డి, డా.ఖలీల్, డా.గిరిజా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, నిరంజన్, వై.గీతాలు, రాజ్యలక్ష్మి, డీపీఓ సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో..
బేగంపేట్ అక్టోబర్ 2 : సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూల మాల వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు త్రిపుర చీఫ్ జస్టీస్ అమర్నాథ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.