Dental College | జవహర్‌నగర్, మార్చి 21 : దంత వైద్యం సున్నితమైందని, మనిషి ఆకారానికి కొత్తందాన్ని ఇస్తాయని, నూతన టెక్నాలజితో యువ డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పిలుపునిచ్చారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని ఆర్మీ డెంటల్ సైన్సెస్ కళాశాలలో శుక్రవారం వైభవంగా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరై మాట్లాడుతూ.. మనిషి శరీరంలో ఎక్కడైనా ఆపరేషన్ చేయవచ్చు కానీ దంతాలకు ఆపరేషన్ చేయడం అతిముఖ్యమైందని, దంతాలు బాగుంటేనే మాట్లాడటం, తీనడం జరుగుతుందని అలాంటి దంతవైద్య విద్యను అభ్యసించడం అదృష్టమని, తెలంగాణ వైద్య రంగంలో కొత్తపుంతలు తొక్కుతుందని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన యువ దంతవైద్య డాక్టర్లకు అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్మీదంత వైద్య కళాశాల అధ్యాపకులు, ఆర్మీ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.