Bandaru Dattatreya | శంషాబాద్ రూరల్, అక్టోబర్ 20: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆదివారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో గవర్నర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు.
గవర్నర్ వాహనం శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోకి రాగానే.. అదే సమయంలో ఎండివర్ కారు డ్రైవర్ సర్ఫరాజ్ ఖాన్ ఒక్కసారిగా ఎడమ వైపు తిరగడంతో.. వెనుక నుంచి వస్తున్న గవర్నర్ కన్వాయ్లోని కార్లు ఒకటికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. గవర్నర్కు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.