ముషీరాబాద్, డిసెంబర్ 23: క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం గోల్కొండ చౌరస్తాలోని ఎంబీ చర్చిలో ఎమ్మెల్యే పేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, క్రైస్తవుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. దళిత క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం వర్తింపచేస్తుందని, క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు రావులపాటి మోజస్, ఎంబీ చర్చి చైర్మన్ ప్రకాశ్, కార్యదర్శి శ్యామ్, కోశాధికారి జార్జ్, ప్రకాశ్, వినయ్, జ్ఞానసుందర్, వందనం, అభిశాలేం, పాస్టర్లు పాల్గొన్నారు.
రాంనగర్ టీఆర్టీ క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసిన శుక్షాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తగరం అనిల్‌కుమార్, నేత శ్రీనివాస్, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
రాంనగర్ కాకతీయ హైస్కూల్లో శుక్రవా రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు విభిన్న వేశధారణలతో శాంతి సందేశాన్ని చాటే నాటకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ గోక నవీన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు మోజస్, శివ, రమాకాంత్, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కవాడిగూడ: శుక్రవారం కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు వివిధ వేషధారణలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదులు జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ పి. స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.