డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ శివాజీనగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
- కొండాపూర్‌లో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన విప్ గాంధీ
- పాల్గొన్న కార్పొరేటర్లు
కొండాపూర్/శేరిలింగంపల్లి/మాదాపూర్/మియాపూర్ , డిసెంబర్ 28 : డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ శివాజీనగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో డ్రైనేజీ సమస్యలు పునరావృతమవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఇంజినీర్లతో చర్చించి నూతన యూజీడీ లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణగౌడ్, గుడ్ల ధనలక్ష్మి, ఉరిటి వెంకట్రావ్, అక్భర్‌ఖాన్, జనార్దన్‌రెడ్డి, పాల్గొన్నారు.
కొండాపూర్‌లో..
కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో నూతన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ మేనేజర్ యాదగిరి, డీజీఎం నారాయణ, మాజీ కార్పొరేటర్ రవిందర్ ముదిరాజ్, నాయకులు చాంద్‌పాషా, నర్సింహాసాగర్, గణపతి, తిరుపతిరెడ్డి, నందు, లింగారెడ్డి, సాగర్ చౌదరి, రవి శంకర్ నాయక్, గౌరీ, బస్వారాజు తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి
భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్‌తో పాటు జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానిక కార్పొరేటర్ల వినతి మేరకు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఒక కిలో మీటర్ మేర మంజూరైన భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు శంకుస్థాననలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజిఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం, హఫీజ్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, కరుణాకర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, కనకమామిడి నరేందర్ గౌడ్, వార్డు సభ్యులు శేఖర్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం కృషిచేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం శేరిలింగంపల్లి డివిజన్లోని తారానగర్‌లో మహిళ భవన నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం, బీఆర్ఎస్ నాయకులు రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వర్కర్ల సేవలు మరువలేనివి
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశవర్కర్లకు నూతన యూనిఫామ్‌లను కార్పొరేటర్ వి. పూజిత గౌడ్‌తో పాటు డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, సృజనలతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అరవింద్, రాకేశ్, హఫీజ్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, కరుణాకర్‌గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
నియోజకవర్గంలో అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఎం నేతలు విప్ గాంధీని కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ కార్యదర్శి శోభన్, కమిటీ సభ్యులు వెంకన్న, కృష్ణ, రవి, సంజయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

