Balapur | ఇంత నిర్లక్ష్యమా..? ఫర్నిచర్‌ను గాలికి వదిలేశారు
లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్‌ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్‌ను తీసి..పాఠశాలల మైదానంలో వేశారు.
Balapur | లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్‌ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్‌ను తీసి..పాఠశాలల మైదానంలో వేశారు. అయితే పోలింగ్ పూర్తయిన వెంటనే వాటిని తిరిగి తరగతి గదుల్లో పెట్టించాలన్న ఆలోచనను అధికారులు మర్చిపోయారు. దీంతో విలువైన ఫర్నిచర్ పాడయ్యే అవకాశమున్నది. బాలాపూర్ మండల పరిధిలోని అన్ని సర్కారు స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ కింద కోట్లు ఖర్చు చేసి.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఫర్నిచర్‌ను అందజేశారు. ఇవి నాలుగు కాలాల పాటు విద్యార్థులకు ఉపయోగపడేవి. ఇదిలా ఉంటే మున్సిపల్ అధికారులు మాత్రం ఎవరి ఫర్నిచర్ వారే చూసుకోవాల్సిందేనంటున్నారు. ఈ విషయమై విద్యాధికారులకు ఫోన్లు చేసినా.. స్పందించలేదు. కొందరు ఉపాధ్యాయులు స్పందించి మున్సిపల్ అధికారులు చూసుకుంటారని సమాధానాన్ని దాట వేశారు. మీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఆరుబయట పడేసిన ఫర్నిచర్‌ను చిత్రంలో చూడొచ్చు.
-బడంగ్‌పేట, మే17
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

