సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : బల్దియా పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు సర్కారు వన్ టైం స్కీం తీసుకొచ్చింది.
ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ, ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి యాజమాన్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.