పీర్జాదిగూడ: పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలనీలో మహ్మద్ గౌస్ తన రేకుల ఇంటిని మరమ్మతులు చేసుకుంటుండగా, స్థానిక కాంగ్రెస్ నేతలు పరమేశ్, ఖరీం ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.
3 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వలేదని తమపై తప్పుడు సమాచారం అధికారులకు అందించారని బాధితుడు ఆరోపించాడు. ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది జేసీబీతో రాగా, మహ్మద్ గౌస్ కుమారుడు షానావాజ్ ఇంటిని కూల్చవద్దంటూ.. పెట్రోలు పోసుకొని.. ఆత్మహత్య చేసుకుంటానంటూ.. హెచ్చరించాడు. దీంతో సిబ్బంది వెనుతిరిగారు.