శంషాబాద్ రూరల్, మే 22 : శంషాబాద్ సర్కిల్లోని కొత్వాల్‌గూడ డివిజన్లో ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జాచేసి భారీ నిర్మాణాలు చేశారు. స్థానికులు రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు పోలీసుల సహకారంతో సర్వే నంబర్ 626భై1లోని రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేశారని వివరించారు. అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.