మేడ్చల్, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలపై లేక్క తెల్చేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. జవహర్‌నగర్‌లో సుమారు 5,977 వేల ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులలో ఉండగా మాజీ సైనికులకు అందించింది పోగా హెచ్ఎండీఏకు 2,370 ఎకరాలు, డంప్‌యార్డ్‌కు పోను మరో 2,500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉంటుంది.
5 వేల ఎకరాల ప్రభుత్వ భూములు సుమారు 2 వందల సర్వే నెంబర్లలో ఉన్నాయి. అయితే ఇటివలే జవహర్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ భూముల లేక్కను తెల్చేలా రెవెన్యూ బృందాలు పరిశీలించంగా సుమారు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురై అనేక అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా ఉన్న భూములను ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించేలా చర్యలు తీసుకునేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రస్తుతం జవహర్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ భూముల లేక్కను తెల్చి జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు సమర్పించినట్లు సమాచారం.
జవహార్‌నగర్ ప్రభుత్వ భూముల వివరాలను సర్కార్‌కు అందించనున్న జిల్లా యంత్రాంగం,, జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా యంత్రాంగం త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల వివరాల నివేదికతో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇటివలే సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను సేకరించినట్లు సమాచారం. 5,977 ఎకరాల ప్రభుత్వ భూములలో ప్రస్తుతం ఉన్న భూములను లేక్కలతో తేల్చి నివేదికను సిద్ధం చేశారు. అయితే ప్రసుత్తం ఉన్న భూములలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రెవెన్యూ ప్రత్యేక బృందాలు కబ్జాచేసిన వారి వివరాలను నివేదికలో పోందుపరిచినట్లు తెలుస్తోంది.
జవహర్‌నగర్‌లో వేట్ల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. అప్పట్లో 1941లో మిలటరీ అవసరాల కోసం తీసుకున్న 5977 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. 1958లో జవహర్‌నగర్ కో ఆపరేటివ్ సోసైటి పేరిట వాటిని మార్చారు. దశల వారీగా 2004లో 2,370 ఎకరాలను హెచ్ఎండీఏకు కు ప్రభుత్వం అప్పగించింది.
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జవహర్‌నగర్‌కు అనేక సంస్థలు రావడంతో అ ప్రాంతమంతా డిమాండ్ పెరిగింది. దీంతో కబ్జాదారులు అప్పటి నుంచి భూములను కబ్జా చేస్తు నోటరీలపై విక్రయిస్తువస్తున్నారు. ఇలా వేల కోట్ల విలువైన 975 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైనట్లు అధికారులు అంచనాకు వచ్చారు. 613, 614, 510, 432, 495 ఇలాంటి అనేక ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లలో కబ్జాలకు గురై నిర్మాణాలు జరిగిన విషయం
తెలిసిందే.