మల్కాజిగిరి, జూన్ 10: ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిధులను పెంచాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మంగళవారం ఆషాఢ మాసం బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయ శాఖ, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సంస్థ తుంగభద్ర గులాబీ ఎస్కే హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గానికి ఆషాఢ మాస బోనాల పండుగ ఏర్పాట్లకు నిధులు పెంచాలని, నియోజకవర్గం లోని పెద్ద దేవాలయాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించే విధంగా సహకరించాలని కోరారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తికి మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎంపీ మందాడి అనిల్ కుమార్ యాద వ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, డీజీపీ జితేందర్, దేవాదాయ ధర్మాదా య శాఖ అధికారులు, వివిధ ఆలయాల కమిటీల సభ్యులు, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత కిశోర్, బీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్, అమీనుద్దీన్,శోభన్ బాబు, యాదగిరి గౌడ్, శరణగిరి, సురేశ్, ఉస్మాన్, హేమంత్ పటేల్, వంశీ, ఓం రాజ్ తదితరులు పాల్గొన్నారు.