హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఈ నెల 11న ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) జరుగనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నవంబర్ 11న (మంగళవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నోటిఫికేషన్ విడుదల చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన సతీమణి మాగంటి సునీతను బరిలో నిలిపింది. ఆమె గెలుపుకోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
