ఉప్పల్, మార్చి 24: ఉప్పల్‌కు (Uppal) చెందిన పలువురు గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికలో ప్రవారీ గోడ నిర్మాణం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. నియోజక వర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, గౌడ సంఘం నాయకులు పల్లె రాజు కుమార్, నేర్థం భాస్కర్, అర్జున్ , నవీన్ , భరత్ తదితరులు పాల్గొన్నారు.