Gold rates | హైదరాబాద్‌లో బంగారం ధరలు భగభగ.. తులం రూ. 65 వేలకు చేరే అవకాశం..!
Gold rates | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నగరంలో బంగారం ధరలు( Gold Rates ) ఆకాశాన్నంటాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు భగభగమంటున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,030 పెరిగి రూ. 61,360 కి చేరుకుంది.
Gold rates | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నగరంలో బంగారం ధరలు( Gold Rates ) ఆకాశాన్నంటాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు భగభగమంటున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,030 పెరిగి రూ. 61,360 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 56,350గా ఉంది. 22 క్యారెట్ల బంగారం తులంపై రూ. 950 పెరిగింది. ఈ ధరలు ఇంతటితో ఆగిపోయే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో రూ. 65 వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూఎస్ డాలర్ రేటు పడిపోవడం, యూఎస్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకోవడం, చమురు ధరలు పెరగడం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి. బంగారం ధరలకు బెంచ్ మార్క్‌గా పరిగణించబడే యూఎస్ డాలర్ గత కొద్ది రోజుల నుంచి హెచ్చుతగ్గులకు లోనవడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు జనాలు జ్యువెలరీ షాపుల వద్ద ఎగబడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

