ముందస్తు జాగ్రత్తే కిడ్నీలకు రక్ష
భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ) ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన సవాలుగా మారుతున్నది. మధుమేహం,అధిక రక్తపోటు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి లాంటి కారణాలతో కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం పెరుగుతున్నది. ముఖ్యంగా వ్యాధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే కిడ్నీల పని తీరు మరింత క్షీణించకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.
భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ) ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన సవాలుగా మారుతున్నది. మధుమేహం,అధిక రక్తపోటు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి లాంటి కారణాలతో కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం పెరుగుతున్నది. ముఖ్యంగా వ్యాధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే కిడ్నీల పని తీరు మరింత క్షీణించకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.
మూత్రపిండాల నిర్మాణం లేదా పనితీరులో అసాధారణ మార్పులు కనీసం మూడు నెలల పాటు కొనసాగితే దానిని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ)గా పరిగణిస్తారు. రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం, శరీరంలో నీరులవణాల సమతుల్యతను కాపాడటం, రక్తపోటు నియంత్రణలో సహకరించడం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన ప్రక్రియల్లో భాగస్వామ్యం కావడం వంటి కీలక విధులను కిడ్నీలు నిర్వహిస్తాయి. కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతోపాటు రక్తహీనత, ఎముకల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వ్యాధి ముదిరిన దశల్లో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.

ఎవరికి ప్రమాదం
- మధుమేహం (Diabetes Mellitus) ఉన్నవారు.
- అధిక రక్తపోటు (Hypertension) ఉన్నవారు.
- ఊబకాయం ఉన్నవారు.
- కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు.
- తరచూ కిడ్నీలో రాళ్లు ఏర్పడేవారు.
- పునరావృత మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు.
- దీర్ఘకాలికంగా నొప్పి నివారణ మందులు లేదా కిడ్నీలపై ప్రభావం చూపగల ఇతర మందులు వాడేవారు.
వృద్ధులు, గతంలో తీవ్రమైన కిడ్నీ గాయం (Acute Kidney InjuryAKI) ఎదుర్కొన్నవారు.
ఈ ప్రమాద కారకాలు ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా కిడ్నీ వ్యాధి వస్తుందని కాదు. అయితే, వీరు వైద్యుల సలహా మేరకు కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం అవసరం.
లక్షణాలు కనిపించకపోవడమే సమస్యకిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ప్రారంభ దశల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా కిడ్నీల పనితీరు తగ్గుతూ ఉండవచ్చు.

వ్యాధి ముదిరినప్పుడు లక్షణాలు
- త్వరగా అలసిపోవడం, నీరసం.
- ఆకలి తగ్గడం, వికారం లేదా వాంతులు.
- కాళ్లు, పాదాలు, ముఖం చుట్టూ వాపు.
- చర్మం పొడిబారడం, దురద.
- మూత్ర విసర్జనలో మార్పులు.
- రక్తహీనత కారణంగా పాలిపోవడం.
- కండరాల నొప్పులు లేదా తిమ్మిర్లు.
- వ్యాధి తీవ్రమైనప్పుడు ఏకాగ్రత తగ్గడం లేదా గందరగోళం.
- ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లోనూ కనిపించవచ్చు. కాబట్టి లక్షణాల ఆధారంగా మాత్రమే కిడ్నీ వ్యాధిని నిర్ధారించలేం. పరీక్షల ద్వారా కనిపెట్టాల్సిందే.
ఏయే పరీక్షలు అవసరం
కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించడానికి సాధారణ రక్త, మూత్ర పరీక్షలు ఉపయోగపడతాయి.
1. సీరమ్ క్రియాటినిన్: రక్తంలోని క్రియాటినిన్ స్థాయిని కొలుస్తారు. దీని ఆధారంగా అంచనా గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ (eGFR)ను లెక్కించి కిడ్నీలు రక్తాన్ని ఎంత సమర్థంగా వడపోస్తున్నాయో అంచనా వేస్తారు.
2. మూత్రంలో అల్బుమిన్ పరీక్ష: మూత్రంలో అల్బుమిన్ అనే ప్రొటీన్ అసాధారణంగా బయటకు వెళ్తుందా అనే విషయాన్ని గుర్తిస్తుంది. కిడ్నీ దెబ్బతినడాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఈ పరీక్ష ఎంతో ఉపయోగకరం.
అవసరాన్ని బట్టి మూత్ర పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇతర రక్త పరీక్షలు లేదా కిడ్నీ బయాప్సీ చేయవచ్చు. ఒకసారి వచ్చిన అసాధారణ ఫలితంతోనే సీకేడీ అని నిర్ధారించకూడదు. వైద్యుల సూచన మేరకు మళ్లీ పరీక్షలు చేసి, మార్పులు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతున్నాయా అని గమించాల్సి ఉంటుంది.

సీకేడీలో ఐదు దశలు
కిడ్నీల వడపోత సామర్థ్యం ఆధారంగా సీకేడీని ప్రధానంగా ఐదు దశలుగా వర్గీకరిస్తారు. అయితే మొదటి రెండు దశల్లో కిడ్నీ దెబ్బతినడానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండాలి.
మొదటి దశ: eGFR 90 లేదా అంతకంటే ఎక్కువ. కిడ్నీల పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, మూత్రంలో అల్బుమిన్ లేదా ఇతర నిర్మాణ సంబంధిత అసాధారణతలు ఉండవచ్చు.
రెండో దశ: eGFR 6089. కిడ్నీ దెబ్బతినడానికి
సంబంధించిన ఆధారాలు ఉండాలి.
మూడో దశ (G3): eGFR 3059. కిడ్నీల పనితీరు మధ్యస్థాయిలో తగ్గుతుంది.
నాలుగో దశ: eGFR 1529. కిడ్నీల పనితీరు తీవ్రంగా తగ్గుతుంది.
ఐదో దశ: eGFR 15 కంటే తక్కువ. ఇది కిడ్నీ వైఫల్య దశ. రోగి పరిస్థితిని బట్టి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం కావచ్చు.
వ్యాధి దశతోపాటు మూత్రంలో అల్బుమిన్ స్థాయి, వ్యాధికి కారణం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చికిత్స నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు
మధుమేహం: దీర్ఘకాలం రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో లేకపోతే కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ఏర్పడవచ్చు. రక్తంలో చక్కెరను వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నియంత్రించడం, అవసరమైన మందులు వాడటం, మూత్రంలో అల్బుమిన్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
అధిక రక్తపోటు: నియంత్రణలో లేని రక్తపోటు కిడ్నీల రక్తనాళాలను దెబ్బతీస్తుంది. మరోవైపు కిడ్నీ వ్యాధి కూడా రక్తపోటును పెంచవచ్చు. అందువల్ల రక్తపోటును క్రమం తప్పకుండా కొలుచుకోవడం, వైద్యులు సూచించిన చికిత్సను కొనసాగించడం అవసరం.
గ్లోమెరులోనెఫ్రైటిస్: కిడ్నీల వడపోత యూనిట్లలో వాపు లేదా రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన నష్టం ఏర్పడటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మూత్రంలో రక్తం లేదా ప్రొటీన్ కనిపించడం, వాపు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉండవచ్చు.
కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు: పునరావృత రాళ్లు, మూత్ర ప్రవాహానికి అడ్డంకులు, సకాలంలో చికిత్స పొందని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కిడ్నీలకు శాశ్వత నష్టం కలిగించవచ్చు. రాళ్లు ఏర్పడటానికి కారణాలను గుర్తించి, మళ్లీ ఏర్పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
వంశపారంపర్య వ్యాధులు: పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధుల్లో కిడ్నీలలో తిత్తులు ఏర్పడి, కాలక్రమేణా పనితీరు తగ్గవచ్చు. కుటుంబ చరిత్ర ఉన్నవారు వైద్య సలహా పొందాలి.
ఇతర కారణాలు: కొన్ని రకాల కిడ్నీ వాపు వ్యాధులు, దీర్ఘకాలిక మందుల దుష్ప్రభావాలు, మూత్రనాళ అడ్డంకులు, తీవ్రమైన కిడ్నీ గాయం వంటివి కూడా సీకేడీకి
దారితీయవచ్చు.

ఏకేఐపై అప్రమత్తత అవసరం
తీవ్రమైన విరేచనాలు, వాంతులు, శరీరంలో నీరు తగ్గిపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, రక్తపోటు బాగా పడిపోవడం లేదా కిడ్నీలకు హాని కలిగించే మందుల కారణంగా గంటలు లేదా రోజుల్లోనే కిడ్నీల పనితీరు తగ్గవచ్చు. దీనిని అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) అంటారు.
సకాలంలో చికిత్స అందితే కొందరిలో కిడ్నీల పనితీరు తిరిగి మెరుగుపడుతుంది. తీవ్రమైన సందర్భాల్లో తాత్కాలిక డయాలసిస్ అవసరమవుతుంది. అయితే ఏకేఐ తర్వాత కొందరిలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల కోలుకున్న తర్వాత కూడా వైద్యుల సూచన మేరకు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
వ్యాధి నియంత్రణ ఇలా..
సీకేడీని పూర్తిగా నయం చేయడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోయినా, సరైన చికిత్సతో వ్యాధి పురోగతిని నెమ్మదింపజేయవచ్చు.
- రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచాలి.
- రక్తపోటును వైద్యులు సూచించిన లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించాలి.
- ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. రోజువారీ సోడియం పరిమాణం సాధారణంగా2 గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఇది 5 గ్రాముల ఉప్పుతో సమానమన్నమాట.
- ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి; క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి.
- నొప్పి నివారణ మందులు, యాంటీ బయాటిక్స్ లేదా ఇతర మందులను వైద్యుల సలహా లేకుండా తరచూ వాడకూడదు.
- తగినంత నిద్ర, సమతుల ఆహారం, శారీరక చురుకుదనం అలవాటు చేసుకోవాలి.
- మద్యం వినియోగాన్ని నివారించడం లేదా పరిమితం చేయడం మంచిది.
- వైద్యుల సలహా మేరకు అవసరమైన టీకాలు వేయించుకోవాలి.
- సీకేడీ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొటీన్, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు లేదా పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆహార నియంత్రణ వ్యాధి దశ, రక్త పరీక్షలు, పోషకాహార స్థితిని బట్టి నెఫ్రాలజిస్ట్ లేదా నిపుణులైన డైటీషియన్ సూచనల ప్రకారం ఉండాలి.
అందుబాటులో ఉన్న చికిత్సలు
కిడ్నీల పనితీరు తీవ్రంగా తగ్గినప్పుడు రోగి పరిస్థితిని బట్టి మూత్రపిండాల ప్రత్యామ్నాయ చికిత్స (Kidney Replacement Therapy) అవసరమవుతుంది. ఇందులో ప్రధానంగా రెండు చికిత్సా విధానాలు ఉన్నాయి.
డయాలసిస్: రక్తంలోని వ్యర్థ పదార్థాలు, అదనపు నీటిని తొలగించడానికి ఉపయోగించే చికిత్స. హీమో డయాలసిస్‌లో ప్రత్యేక యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తారు. పెరిటోనియల్ డయాలసిస్‌లో పొత్తికడుపులోని పొరను ఉపయోగించి వ్యర్థ పదార్థాలను తొలగిస్తారు. ఏ విధానం అనుకూలమో రోగి పరిస్థితి, వైద్య అవసరాలు, అందుబాటును బట్టి నిర్ణయిస్తారు.
కిడ్నీ మార్పిడి: అనుకూలమైన జీవించి ఉన్న దాత నుంచి లేదా మరణానంతర అవయవదానం ద్వారా లభించిన కిడ్నీని రోగికి అమర్చవచ్చు. ఇందుకు వైద్య పరీక్షలు, చట్టపరమైన అనుమతులు, దాతగ్రహీత అనుకూలత అవసరం. మార్పిడి తర్వాత కొత్త కిడ్నీని శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు రోగి జీవితాంతం వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులు తీసుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్. ఎ.శశి కిరణ్ , సీనియర్ నెఫ్రాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ – హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

