ఈ ప్రశ్నలకు జవాబులేమిటి?
తీవ్రమైన ఒత్తిడితో ఆత్మరక్షణకు లోనైన కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ సమర్పించింది. సర్ ప్రక్రియపై తీసుకున్న నిర్ణయాలు అన్నీ ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా తీసుకున్నవేనని, ఇద్దరు విభేదించినా ప్రధాన కమిషనర్ ఏకపక్షంగా తీసుకున్నవి కావని సంజాయిషీ ఇవ్వబూనింది. కానీ ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అదీగాక, సర్‌ను పురస్కరించుకుని జరిగిన, జరుగుతున్న లెక్కలేనన్ని అక్రమాల గురించి కమిషన్ నేటికీ నోరెత్తడంలేదు.
తీవ్రమైన ఒత్తిడితో ఆత్మరక్షణకు లోనైన కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ సమర్పించింది. సర్ ప్రక్రియపై తీసుకున్న నిర్ణయాలు అన్నీ ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా తీసుకున్నవేనని, ఇద్దరు విభేదించినా ప్రధాన కమిషనర్ ఏకపక్షంగా తీసుకున్నవి కావని సంజాయిషీ ఇవ్వబూనింది. కానీ ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అదీగాక, సర్‌ను పురస్కరించుకుని జరిగిన, జరుగుతున్న లెక్కలేనన్ని అక్రమాల గురించి కమిషన్ నేటికీ నోరెత్తడంలేదు.
ఈ వ్యవహారమంతా విడతలుగా 2025 జూన్, 2026 మే నెలల్లో మొదలైంది. అప్పటి నిర్ణయాల్లో తాము 14 సార్లు విభేదించామని, అయినప్పటికీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తానే నిర్ణయాలు తీసుకున్నారని కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ తమ నోట్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయం వెల్లడైనప్పుడు గానీ, దానిపై పెద్దఎత్తున ఆందోళనలు మొదలైనప్పుడు గానీ, పత్రికా కథనాలను ఎన్నికల కమిషన్ ఖండించలేదు. ప్రధాన కమిషనర్, తక్కిన ఇద్దరు కమిషనర్లు మౌనంగానే ఉన్నారు. ఎందువల్ల? నిర్ణయాలన్నీ ఏకగ్రీవమని ఇప్పుడు అఫిడవిట్లో విన్నవించినట్టు ఇంతవరకు మాట్లాడనిది ఎందుకు?
కమిషన్‌లో నిర్ణయాలు ఏ పద్ధతిలో తీసుకుంటారనే విషయమై అఫిడవిట్లో సుదీర్ఘ వివరణ ఒకటి ఇచ్చారు. ఏ అంశం గురించి అయినా మొదట ఒక కమిషనర్ పరిశీలించి, తర్వాత రెండవ కమిషనర్ పరిశీలించి, ఆఖరున ప్రధాన కమిషనర్ పరిశీలించడం, ఆ క్రమంలో సందేహాలు, వివరణల వంటివి మామూలేనని చెప్పారు. చివరన నిర్ణయాలు ఏకగ్రీవంగా జరుగుతాయని సర్ విషయంలో అంతే జరిగిందని కూడా అన్నారు. కానీ ఇందులో సమర్థనలు తప్ప వాస్తవాలు కనిపించవు. అఫిడవిట్లో చెప్పిన ఈ క్రమం అంతా నిబంధనల ప్రకారం రూల్‌బుక్‌లో ఉన్నదే కావచ్చు. ఆ పద్ధతులన్నీ తక్కిన ఇద్దరు కమిషనర్లకు కూడా తెలిసినవే. కానీ, నిర్ణయాలు ఆ పద్ధతిలో వాస్తవంగా జరిగాయా అనేది ప్రశ్న. జరగలేదన్నది వారిద్దరు పేర్కొన్న మాట. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా తీసుకున్నారనే మాట కూడా వారన్నారు. ఆ మేరకు వారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. వాటినెవరూ ఖండించలేదు. దీనిని బట్టి ఏమని భావించాలి?
ఏకసభ్య కమిషన్‌లో మరొక ఇద్దరు చేరినప్పుడు, నిర్ణయాలు ఏకగ్రీవంగా జరగాలి లేదా మెజారిటీ అభిప్రాయంతో అనే నిబంధనను చట్టంలో చేర్చారు. కానీ సర్ నిర్ణయాలు అట్లా జరగకపోవడమన్నదే సమస్యగా మారింది. ఒకవేళ ఏకగ్రీవంగానో, లేక మెజారిటీ నిర్ణయంతోనో జరిగి ఉన్నా యథాతథంగా ఈ సర్ ప్రక్రియ దుర్మార్గమైనదే. మనం ప్రస్తుతం చూస్తున్న అక్రమాలన్నీ అప్పుడు కూడా జరిగి ఉండేవే. వాటిని ప్రజలు వ్యతిరేకించేవారే. ఒక అక్రమానికి నిబంధనల ప్రకారం అధికారిక ముద్ర పడినంత మాత్రాన అది సక్రమమైపోదు. అందువల్ల, ఎన్నికల కమిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ అనేది రూల్స్ ప్రకారం సరైనదని తేలినా, సుప్రీంకోర్టు అవునన్నా, ఓటరు జాబితాల అవకతవకలు సక్రమమైనవిగా తేలవు. అదట్లుంచితే, యథాతథంగా ఈ అఫిడవిట్ అన్ని విషయాలను వాస్తవంగా తెలియజేసిందనుకున్నా, ఓటరు జాబితాల సవరణలోని అక్రమాల గురించి మాత్రం చెప్తున్నదేమీ లేదు. ఎందువల్ల?
ఆందోళనలు జరుగుతున్నది సర్ అక్రమాల గురించే తప్ప, కమిషన్‌లో అంతా పద్ధతి ప్రకారం జరిగిందా లేదా అని కాదు. అక్రమాలు జరగడం, అవి వెల్లడి కావడం నిరుటి అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే మొదలైంది. కమిషన్‌లో ఏం జరిగిందన్నది ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటిది. ఇప్పుడు ఈ అఫిడవిట్ దరిమిలా సర్వత్రా కలుగుతున్న అభిప్రాయం, మోదీ ప్రభుత్వం ఇద్దరు కమిషనర్లను ఒత్తిడి చేసి, ఈ మాట చెప్పిస్తున్నదని.
ప్రభుత్వం గురించి, కమిషన్ గురించి ఒకసారి అనుమానాలు ఏర్పడి బలపడిన తర్వాత ఇక ఎటువంటి వివరణలూ పని చేయవు. ఫారం-6కు సంబంధించిన వివరణ కూడా నమ్మించలేని విధంగానే ఉన్నది. ఇంతవరకు జరిగిందేమిటి? ఆ ఫారంలో ఒరిజినల్‌గా లేని వాటిని తర్వాత చేర్చారు. నిబంధనల ప్రకారం ఒరిజినల్‌కు ఎటువంటి మార్పులైనా చేయగల అధికారం పార్లమెంటుకు ఉన్నది తప్ప ఎన్నికల సంఘానికి కాదు. అయినప్పటికీ జ్ఞానేశ్‌కుమార్ ఆ పని చేయబూనారు. అందుకు మిగిలిన ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపినా లెక్కచేయక అమలు పరచారు. ఆ కారణంగా జాబితాల సవరణ సమయంలో చాలా సమస్యలు వచ్చాయి. అప్పుడు జ్ఞానేశ్‌కుమార్ అందుకు సుప్రీంకోర్టు నుంచి ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఆమోదం లభించిందన్నారు. అసలు ఆ విషయమే తమ దృష్టికి రాలేదని, తాము ఎటువంటి ఆమోదం తెలుపలేదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేయడంతో ఇరకాటంలో పడిన కమిషన్ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు అఫిడవిట్లో వివరణ ఇవ్వబూనింది. దాని ప్రకారం, ఫారంలో మార్పులేమీ చేయలేదట. ఆ తేడాలతో కూడిన పత్రం వేరే దస్తావేజట. దానిని ఆన్లైన్లో ఉంచడం వల్ల అది ఒరిజినల్ ఫారంలో భాగమని భావించే అవకాశం ఏర్పడిందట. ప్రశ్న ఏమంటే, ఇదంతా పొరపాటని ఇప్పుడు అఫిడవిట్లో పేర్కొన్న కమిషన్, ఈ పొరపాటును ఎప్పుడు గుర్తించింది? ఆ విషయం ఓటర్లకు, అంతకన్నా ముఖ్యంగా సర్ యంత్రాంగానికి ఎప్పుడు ఎప్పుడు తెలియజేసింది? ఫారం నుంచి ఈ డిక్లరేషన్‌ను ఎప్పుడు వేరు చేసింది?
అఫిడవిట్లో చెప్పిన దాని ప్రకారమే, అట్లా వేరు చేయడం అక్టోబర్ 21న జరిగింది. అంతటి ఆలస్యానికి కారణమేమిటి? అప్పటికే జాబితాల కార్యక్రమం అంతటా ముగిసిపోయింది. అందుకోసం ఒరిజినల్ గడువులు, పొడిగించిన గడువులు అన్నీ తీరిపోయాయి. జరగవలసిన గందరగోళం, దానితోపాటు అక్రమాలు, ప్రతి రాష్ట్రంలోనూ లక్షలాది ఓట్లు మాయం కావడం, అధికారుల చుట్టూ తిరగలేక ఓటర్లు ఎందుకీ తలనొప్పి అనుకుని వదిలివేయడం వంటివన్నీ జరిగిపోయాయి. ఈ పరిస్థితి అంతా ప్రతిరోజూ పత్రికల్లో చానళ్లలో, సోషల్ మీడియాలో వెలువడుతూనేపోయింది. అదంతా రాష్ర్టాల స్థాయి కమిషనర్లు, కేంద్ర కమిషన్ దృష్టికి రానే రాలేదని భావించగలమా? ఆ తర్వాత జ్ఞానేశ్‌కుమార్ చేసిందేమిటి? ఇప్పుడు జరగవలసినదంతా జరిగిపోయినాక సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణలోని ఉద్దేశమేమిటి? అందువల్ల ఆచరణ రూపంలో కలిగే ఉపయోగమేమిటి?
ఇవేమీ ఉండవని చిన్న పిల్లలైనా చెప్పగలరు. అయితే, దీనంతటి వల్ల ఉపయోగం జరగవలసిన వారికి మాత్రం జరిగిపోయింది. ఎవరైతే తమ అధికారం గురించి 2024 లోక్‌సభ ఫలితాల నుంచి భయపడి ఇటువంటి సర్ అక్రమాలకు రూపకల్పన చేసి, ఎన్నికల సంఘంలోని తమ నమ్మకస్తుని ద్వారా అమలు చేయించారో, వారికి కలగవలసిన లాభం మాత్రం జరిగిపోయింది. ఆ లాభాలేమిటో 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవానికి వచ్చాయి. అందువల్ల, అదే క్రమాన్ని కొనసాగించి 2027 అసెంబ్లీ ఎన్నికలను, 2029 లోక్‌సభ ఎన్నికలను గెలువాలన్నది వ్యూహం. విషాదం ఏమంటే, సర్ అక్రమాలు ఇంతగా వెల్లడవుతున్న తర్వాత కూడా పరిస్థితిని కోర్టులు సైతం దిద్దుబాటు చేయనిస్థితిలో భవిష్యత్తు ఏమిటన్నది బోధపడని విధంగా ఉన్నది. అందుకే కావచ్చు హోంమంత్రి అమిత్‌షా గత నెల 22న ఎంతో ధీమాగా, తమ పార్టీ మరొక 30 ఏండ్లపాటు గెలువనున్నదని ప్రకటించారు.
మరొకవైపు, సర్ ద్వారా జరిగిన, జరుగుతున్న అక్రమాల విషయమేమిటన్నది ఎన్నికల కమిషన్ నుంచి, కోర్టుల నుంచి ప్రభుత్వం నుంచి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఒక ఆర్టీఐ ప్రశ్నకు ఎన్నికల సంఘం జవాబిస్తూ, అసలు సర్ నిర్ణయమే మది కాదని వెల్లడించడంతో, దీనికి అర్థమేమిటో, పర్యవసానాలేమిటో, ఆ నిర్ణయం ఎవరిదో బోధపడకుండా ఉన్నది.
ఎన్నికల సంఘం అఫిడవిట్ వల్ల గానీ, ఇతరత్రా గానీ తెలియకుండా మిగిలి ఉన్న ప్రశ్నల్లో, బతికి ఉన్నా చనిపోయినట్టు రాసిన పేర్లు, తాజాగా పిలిభిత్‌లో పదివేల ఓట్లు అక్రమంగా మాయమైనట్టు అధికారికంగా వెల్లడైన కేసును, బీజేపీ వారు ఫారం-7, ఫారం-8ను దుర్వినియోగం చేస్తూ తొలగింపజేస్తున్న ఓట్లను, యువతరం వారు తమ కొత్త ఓట్లను నమోదు చేసుకోకుండా సృష్టిస్తున్న అవరోధాల విషయంలో ఏమి చేయాలనే సందేహాల సంగతేమిటనేవి లక్షా తొంభై ఉన్నాయి.
టంకశాల అశోక్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈ ప్రశ్నలకు జవాబులేమిటి?
ఇది అప్రకటిత ‘క్రాప్ హాలిడే’ కాదా?
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం !
8 తెలంగాణ ప్రగతికి ఐఆర్సీ వేదిక కావాలి: కోమటిరెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి వేదిక కావాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 19న కేంద్రమంత్రి నితిన్ గడరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర రోడ్ నెట్వర్, రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయని, ఇది తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్, ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

