పంటలకు కాదు.. రేవంత్‌కు సెలవిద్దాం
యాసంగిలో పంటలు వేసుకోవద్దు.. సాగునీళ్లు, కరెంటు ఇవ్వలేమం టున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హెచ్చరించారు.
- కరెంట్, నీళ్లు ఇవ్వలేమన్న సర్కార్‌కు బుద్ధిచెబుదాం
- కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంటరా?
- కాంగ్రెస్ తెచ్చిన కరువుపై అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాం
- వనపర్తి జిల్లా అల్వాలలో ఎండిన పంటల పరిశీలన
- రైతన్నల రణభేరిలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
మహబూబ్‌నగర్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగిలో పంటలు వేసుకోవద్దు.. సాగునీళ్లు, కరెంటు ఇవ్వలేమం టున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హెచ్చరించారు. పంటలకు సెలవు అంటున్న రేవంత్‌రెడ్డికి మనమే శాశ్వతంగా సెలవు చెప్పేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువు మం డలాలను ప్రకటించినా, రైతులను ఆదుకునే విషయమై గురించి మాట్లాడటం లేదని మం డిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆయనకు కమీషన్లు, పర్సంటేజీల మీద తప్ప ప్రజల మీద ప్రేమ లే దని దుయ్యబట్టారు.
సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల సమీపంలో ఎండిపోయిన పంటలను హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం రైతన్నల రణభేరి బహిరంగ సభకు హాజరై సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కరువు వచ్చిందని భయపెట్టడం కాదు.. రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మరో 15 రోజులు జూరాల ఆయకట్టుకు సాగునీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని సూచించారు.రాష్ట్రంలో ఇంత కరువుంటే కేంద్ర బృందం ఎందుకు రాలేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బృందం వచ్చి నష్టపరిహారం లెక్కవేస్తుంటే రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నాయకులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
కృష్ణాజలాల వినియోగంపైనా నిలదీస్తాం
కరువు, కృష్ణానది జలాల వినియోగంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణా జలాలు ఒక్కో ఏడాది 28%, 27%, 25% మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అత్యధికంగా 41శాతం వినియోగించుకున్నట్టు గుర్తుచేశారు. రైతులకు ఆదుకునేదాకా ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.కేసీఆర్ ఆ నాడు 10లక్షల ఎకరాలకు నీళ్లిస్తే.. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఈ మూడేండ్లలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అని హరీశ్ ప్రశ్నించారు.
ఎండిన పంటలను పరిశీలించిన హరీశ్
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల్‌లో సాగునీళ్లు లేక కరెంటు సరిగా రాక పంటలు ఎండిపోయి నష్టపోయిన గ్రామ రైతాంగాన్ని సోమవారం హరీశ్‌రావు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. 400 ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయని, రూ. లక్షలు పెట్టుబడి పెట్టినా చిల్లిగవ్వ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతుల పరిస్థితిని చూసి మాజీ మంత్రులు చలించిపోయారు.
వచ్చేది కేసీఆర్ రాజ్యమే : సింగిరెడ్డి
రేవంత్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే కేసీఆర్ రాజ్యం రాబోతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. వానల్లేక కరువు వచ్చిందని ప్రభుత్వం బూటకపు మాటలు చెబుతున్నదని, శ్రీశైలానికి 240 టీఎంసీల వరద వచ్చినా ఈ ప్రభుత్వానికి సోయిలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ రాష్ట్రంలో కరువు సంభవిస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఢిల్లీ బాట పట్టారని మండిపడ్డారు.
ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేసిన మంత్రి, ఓ ఎమ్మెల్యే మూటల పంచాయితీతో కొట్టుకున్నారని ఆరోపించారు. కాగా ఏదుల మండలకేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జిల్లెల శ్రీనివాస్‌రెడ్డి అల్వాల సభలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సమక్షంలో 300 మంది నాయకులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, నాయకులు బాసు హనుమంతు నాయుడు, గట్టు యాదవ్, శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పంటలకు కాదు.. రేవంత్‌కు సెలవిద్దాం
ఈ ప్రశ్నలకు జవాబులేమిటి?
ఇది అప్రకటిత ‘క్రాప్ హాలిడే’ కాదా?
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం !
8 తెలంగాణ ప్రగతికి ఐఆర్సీ వేదిక కావాలి: కోమటిరెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి వేదిక కావాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 19న కేంద్రమంత్రి నితిన్ గడరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర రోడ్ నెట్వర్, రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయని, ఇది తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్, ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

