ఇది అప్రకటిత ‘క్రాప్ హాలిడే’ కాదా?
యాసంగి పంటల విషయంలో సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఆంతర్యం ’క్రాప్ హాలిడే’ అనే అర్థమవుతున్నది. పంటలు వేయాలా వద్దా అనే స్పష్టమైన సమాచారం రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు మాట దాటవేస్తున్నారు.
యాసంగి పంటల విషయంలో సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఆంతర్యం ’క్రాప్ హాలిడే’ అనే అర్థమవుతున్నది. పంటలు వేయాలా వద్దా అనే స్పష్టమైన సమాచారం రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు మాట దాటవేస్తున్నారు. విపక్షాలు క్రాప్ హాలిడే అనగానే ’అలాంటిదేమీ లేదు, ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించలేదు’ అని సర్దుకున్న వ్యవసాయ మంత్రి.. ఒక నిర్దిష్టమైన పంటల విధానాన్ని మాత్రం ప్రకటించలేదు. వ్యవసాయశాఖ నుంచి జిల్లాల వారిగా, నేల, తేమ పరిస్థితుల వారీగా సాగురైతుల కోసం శాస్త్రీయ సమాచారం విడుదల కాలేదు. విపక్షాలు ప్రచారం చేస్తున్న క్రాప్ హాలిడే అనే మాటను నమ్మవద్దని చెప్పేందుకు సాగు మంత్రి హడావుడిగా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ పంటల నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్టు మాట్లాడారు.
ఎల్ నినో పరిస్థితులను వివరించేందుకు అక్టోబర్ 23 న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో జరిపిన ప్రత్యేక సమావేశంలో రబీలో పంటలకు చుక్క నీరు లభించదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పంపు సెట్లలో ఇప్పటికే 15 లక్షలు ఎండిపోయాయి. ప్రజలు నీరు, కరెంటు వాడకం విషయంలో కఠినమైన పొదుపు నిబంధనలు పాటించాలని సలహా ఇచ్చారు. నవంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు రైతులు వీటి విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలకు సావధానంగా వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. నీరు, కరెంటు దొరకదని ముఖ్యమంత్రి అంటే, మీకు తోచిన పంటలు వేసుకోండని వ్యవసాయ మంత్రి ఉచిత సలహా ఇచ్చారు. క్రాప్ హాలిడే అంటే ఇంతకన్నా ఇంకేమి ఉంటుంది?
ఎల్ నినో ప్రభావం దుర్భిక్ష నివారణ చర్యలపై ప్రభుత్వం అక్టోబర్ 28న నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీ వేస్తామన్నారు. ఆ నివేదికను కేంద్రానికి పంపి సాయం కోరుతామన్నారు. ఇప్పటికే కరువు మీద పడి ప్రజలు అల్లాడుతుండగా ప్రభుత్వం మాత్రం ఇంకా కమిటీలు వేసే స్థాయిలోనే ఉన్నది. ఇంతటి కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి లేకుండా ఎలాంటి పకడ్బందీ నిర్ణయాలు తీసుకోకుండా ముగిసిందని పత్రికల్లో వచ్చింది. కరువు నివారణ పట్ల ప్రభుత్వం హాలిడే తీసుకుందనడానికి ఇంకేం రుజువులు కావాలి?
ప్రభుత్వం క్రాప్ హాలిడే నోటితో ప్రకటించకున్నా రాష్ట్రంలో రబీ పంట పరిస్థితులు హాలిడేనే తలపిస్తున్నాయి. నీరు, కరెంటు ఇవ్వం, వీటిపై ఆశ పడకుండా ఏదైనా పంటలు వేసుకోండి అంటే అర్థమేమిటి? ఈసారి చలికాలమే ఉండదని, భూమిపై వేడి మామూలు కన్నా ఎక్కువ ఉంటుందని చెప్తూ నష్టం రాకుండా జాగ్రత్త పడండని సాగుదారులకు చెబుతుంటే ప్రభుత్వ అలసత్వం తెలిసిపోతున్నది.
తేమ అసలే లేని నేలపై విత్తనం మొలకెత్తదు. ఆరుతడి పంటలకైనా బావిలోంచి నీళ్లు కొన్ని అయినా రావాలి. భూతాపాన్ని నీటి లభ్యత కొరవడితే మోటర్లు కాలిపోతాయి. ఈ పరిస్థితి ఈ ఖరీఫ్‌లోనే రైతులు ఎదుర్కొన్నారు. నీరు, కరెంటు ఇవ్వలేని పరిస్థిత్లుల్లో పంటకు సెలవు ప్రకటించి పండించుకునే అవకాశం ఉన్న రైతులకు తగిన సూచనలివ్వాలి. తుఫానులు, అల్పపీడనాల వల్ల జూలైలో, ఆ తర్వాత వర్షాలు జోరుగానే పడ్డాయి. మొత్తానికి ఈ సీజన్లో మన రాష్ట్రంలో వర్షపాత లోటు 17 శాతం మాత్రమే.
ఇలాంటి లోట్లు గతంలో ఉన్నవే. 17% కన్నా ఎక్కువ లోటు వర్షం ఉన్నప్పుడు కూడా రైతులు రిజర్వాయర్లలో నిలువ ఉన్న నీళ్లతో మంచి పంటలు తీశారు. క్రాప్ హాలిడే అంటే జూలైలో పడిన వర్షపు నీళ్లు ఎటు వెళ్లాయి అనే ప్రశ్నకు జవాబు చెప్పవలసి వస్తుందని ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారంతో రాజకీయంగా వాడుకుంటున్నది. ఎల్ నినో వచ్చి కాంగ్రెస్ పాలనా డొల్లతనాన్ని బయటపెట్టింది.
ప్రకృతి పరీక్షలు కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బయట పడింది. ప్రాజెక్టుల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటే ఎల్ నినో ప్రభావం రాష్ట్ర ప్రజలపై తక్కువగా ఉండేది. కరువును ఎదుర్కొనేందుకు రూ. 2 వేల కోట్లతో ప్రణాళికలు అమలు చేసి ఉంటే, ఇప్పుడు రూ. 20 వేల కోట్ల పంట ఎండిపోయేది కాదు. క్రాప్ హాలిడే ప్రకటనే అవసరమయ్యేది కాదు.
రబీ సంగతేమో గానీ ఇప్పటికే యాసంగి పంట 11.18 లక్షల ఎకరాల్లో పూర్తిగా ఎండిపోయిందని లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వం అంచనా ప్రకారం రాష్ట్రంలోని సగం అనగా 320 మండలాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నది. వాటిలోని 120 లో కరువు తీవ్రత అధికంగా ఉన్నది. ఖరీఫ్‌లో రాష్ట్రంలోని 126 లక్షల ఎకరాల్లో నీటి కొరత వల్ల 30 % పంట మార్పిడి జరిగింది. 25 % మేరకు నేలలో సాగు చేపట్టలేదు. రబీలో సుమారు 64 లక్షల ఎకరాల్లో సాగు సాగదు. దానితో వ్యవసాయ కూలీలకు పని దొరుకదు. పశువుల గ్రాసం ఉండదు. పంట వేయక ఆదాయం కోల్పోయినవారి నష్టాన్ని కూడా లెక్కించాలి. ఇలాంటి ఎన్నో అత్యవసర పనుల పట్ల పట్టింపులేని ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అది పాలనకే హాలిడే ప్రకటించినట్టున్నది.
-బద్రి నర్సన్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇది అప్రకటిత ‘క్రాప్ హాలిడే’ కాదా?
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం !
8 తెలంగాణ ప్రగతికి ఐఆర్సీ వేదిక కావాలి: కోమటిరెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి వేదిక కావాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 19న కేంద్రమంత్రి నితిన్ గడరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర రోడ్ నెట్వర్, రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయని, ఇది తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్, ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష!
కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

