18 నుంచి 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు
దరాబాద్‌లోని హైటెక్స్‌లో నవంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) వార్షిక సదస్సు విజయవంతం కోసం రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సహాయక కమిటీలను ఏర్పాటు చేశారు
-
కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నవంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) వార్షిక సదస్సు విజయవంతం కోసం రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సహాయక కమిటీలను ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం ప్రభుత్వం జీవో-560 జారీ చేసింది. సదస్సు పనులను పర్యవేక్షిస్తున్న స్టీరింగ్ కమిటీకి తోడ్పాటుగా వివిధ విభాగాలవారీగా కమిటీలను నియమించారు.
సదస్సు కోసం భోజనం-రిజిస్ట్రేషన్, రవాణా-స్వాగతం, వసతి, ఆర్థికం-ఆదాయం, సాంకేతిక సమావేశాలు, ప్రదర్శన (ఎగ్జిబిషన్), ప్రచారం-సావనీర్, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య-ప్రొటోకాల్, వెబ్సైట్-ఐటీసీ, పోస్ట్-సెషన్ టూర్స్, వేదిక సౌకర్యాలు వంటి మొత్తం 12 విభాగాలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లకు ఆయా కమిటీల చైర్మన్, సభ్యుల బాధ్యతలను అప్పగించారు. సదస్సు నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ఆయా కమిటీల చైర్మన్లు అవసరమైతే ఈఈలు, డీఈఈలు, ఏఈఈల సేవలను అదనపు సభ్యులుగా వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

