Hyderabad | వెంగళరావునగర్, జూన్ 1 : రిటైర్డ్ ఎస్పీ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్మారాలో దాచిన బంగారు మంగళసూత్రాన్ని అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. అమర్పేట శివబాగ్ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఎస్పీ కేవీ పటేల్ తల్లి కె.కౌసల్య ఇంట్లోని అల్మారాలో 10 తులాల మంగళసూత్రాన్ని దాచుకున్నారు. గత నెల 29వ తేదీన అల్మారా తెరిచి చూడగా అందులోని బంగారు మాంగళసూత్రం కనిపించలేదు. చోరీకి గురైందని గ్రహించి ఆదివారం ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.