హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో బుధవారం ఉదయం వరుస చైన్ స్నాచింగ్లు జరిగాయి. బంజారాహిల్స్ ఇందిరానగర్లో ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. జూబ్లీహిల్స్ పరిధిలో కూడా మరో మహిళ మెడలో బంగారు గొలునును అపహరించాడు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.