Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. దోపిడీ దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతూ.. నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు.
తాజాగా ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోవడానికి దొంగ ప్రయత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. బాధితురాలి కేకలు విని, స్థానికులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
సీసీటీవీ ఫుటేజ్
ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం
హైదరాబాద్ –ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలో 4 తులాల గొలుసు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన దొంగ
మహిళ కేకలు విని, దొంగను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు pic.twitter.com/8jK5n9j3lz
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2025