సిటీబ్యూరో, జనవరి 4(నమస్తే తెలంగాణ): గోవా నుంచి నగరానికి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా చేస్తున్న ఒకరి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు కథనం ప్రకారం.. ఇటీవలి కాలంలో గోవా నుంచి పెద్ద నగరానికి వచ్చే వాస్కోడీగామాలో కొంత మంది నాన్‌డ్యూటీపెయిడ్ మద్యం తీసుకువస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం రైలు వచ్చే మార్గమైన శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు సోదాలు నిర్వహించారు.
పలువురి వద్ద రూ.1.50 లక్షల విలువ చేసే 117మద్యం బాటిళ్లు లభించాయి. అందులో జోసెఫ్ వద్ద 15 మద్యం బాటిళ్లు లభించడంతో అతడిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు చేసిన వారిలోఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుల్ యాదగిరి, శ్రీనివాస్, ప్రసన్న, కౌశిక్, అనీఫ్, సాయి, నితిన్ ఉన్నారు.