హైదరాబాద్ : తాటి కల్లుతోపాటు తాటి ముంజలు కోస్తూ తాటి చెట్టుపై(Palm tree) నుంచి జారిపడి గీత కార్మికుడు(Gita worker) మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్(Abdullahpurmet) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మజీద్‌పూర్ గ్రామానికి చెందిన గండేటి తేజ (50) గీత కార్మికుడు.
ఎప్పటిలాగే ఉదయం భార్య సంతోషతో కలిసి బాట సింగారం గ్రామ శివారులో తాటి కల్లు, తాటి ముంజలు తీసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తేజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.