Hyderabad | హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బాపు నగర్ వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు.
ఎస్సార్ నగర్లోని 7-1- 621 /309 లో అనుమతుల మేరకు కాకుండా అదనంగా 6వ అంతస్తు నిర్మాణాలు జరుగుతున్నట్టు అందిన ఫిర్యాదుల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం నాడు చర్యలకు దిగారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సయ్యద్ సైదుద్దీన్ నేతృత్వంలో సెక్షన్ ఆఫీసర్ మన్సూర్ తారిక్ తన సిబ్బందితో ఈ కూల్చివేతలు చేపట్టారు. ఇదిలా ఉంటే అక్రమ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో చెప్పాలంటూ స్థానికుల నుంచి నిరసన ఎదురైంది.