బదిలీ చేసినా..కదలట్లే
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మెహిదీపట్నం: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే కార్వాన్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ గోల్కొండ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రభావతిని ఉన్నతాధికారులు పాతబస్తీ యాకూత్‌పురాకు మూడు రోజుల కిందట బదిలీ చేశారు.ఆమె స్థానంలో ప్రకాశ్‌ను నియమించి బాధ్యతలను అప్పగించారు.
ఈ క్రమంలో గోల్కొండ సర్కిల్ నుంచి ప్రభావతి తాను వెళ్లనంటూ.. అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. ప్రకాశ్ కూడా విధులు నిర్వర్తిస్తుండటంతో ప్రజలు ఎవరిని కలవాలో తెలియని అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా సిబ్బంది కూడా తాము ఏ అధికారి మాట వినాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బదిలీ అవ్వగానే సంబంధిత అధికారి తనను నియమించిన ఇతర ప్రాంతానికి వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఆలా కాకుండా ప్రభావతి గోల్కొండ సర్కిల్ నుంచి వెళ్లనంటూ.. మొండికేస్తుండటంపై సర్వతా విమర్శలు వస్తున్నాయి.ఈ విషయమై సంబంధిత టౌన్ ప్లానింగ్ ఏసీపీ స్వామి నాయక్‌కు వివరణ కోరడానికి ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేరు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

